Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మీ పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేస్తున్నారు..?

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విలువైన వనరులతో తయారు చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల నిర్మాణంలో భాగంగా మెటల్, ప్లాస్టిక్స్ ఇంకా గ్లాస్ వంటి పదర్థాలను వినియోస్తున్నారు. నిరుపయోగంగా మారి మీ ఇంట్లో మూలన పడి ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను రీసైకిలింగ్ లేదా వేరొకరికి దానం చేసినట్లయితే ప్రకృతిని అనేక రకాలైన కాలుష్యాల నుంచి సంరక్షించినవారవుతారు. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. మీ పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను రీసైకిల్ లేదా వితరణ నిమిత్తం వేరొకరికి ఇచ్చే క్రమంలో పాటించాల్సిన అంశాలు: - మీ పాత కంప్యూటర్ లేదా పాత ల్యాప్‌టాప్‌ను రీసైకిలింగ్ నిమిత్తం లేదా వితరణ నిమిత్తం వేరొకరికి దానం చేసే ముందు సదరు గాడ్జెట్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించండి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఆ గాడ్జెట్ మరలా ఉపయోగపడేదైతే మీ వద్దనే ఉంచుకోండి. - మీ పాత కంప్యూటర్ లేదా పాత ల్యాప్‌టాప్‌ను రిసైకిల్ నిమిత్తం లేదా వితరణ నిమిత్తం వేరొకరికి దానం చేసే ముందు సదరు గాడ్జెట్‌లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేయండి. పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను రిసైకిలింగ్ నిమిత్తం ఎవరికి ఇవ్వాలి..? వివిధ గాడ్జెట్ తయారీ కంపెనీలతో పాటు ఆన్‌లైన్ రిటైలర్‌లు పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను రిసైకిలింగ్ నిమిత్తం సేకరించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీకు తెలుసా..? 10లక్షల ల్యాప్‌టాప్‌లను రిసైకిల్ చేయటం ద్వారా వచ్చే ఫలితం అమెరికాలో 3500 ఇళ్లు ఏడాది పాటు ఉపయోగించే విద్యుత్‌ను ఆదా చేసినంత సమానమట. 10మిలియన్‌ల సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేయటం ద్వారా 35వేల పౌండ్ల రాగి, 772 పౌండ్ల, వెండి, 75 పౌండ్ల బంగారం, 33 పౌండ్ల పల్లాడియంను తిరిగి పొందవచ్చట.

Recent Posts