Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అమ్మాయిలకు ఇద్దరితో ప్రేమాయణం మామూలైపోతోందట

మోడ్రన్ ప్రపంచం... సాయంత్రపు వేళల్లో పిజ్జా హట్స్‌లోనో, మల్టీప్లెక్సుల్లోనో హేపీగా ఎంజాయ్ చేయడం నేటి లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఇదివరకు అబ్బాయితో మాట్లాడాలంటే వణుకుతో గిజగిజలాడే అమ్మాయిలు నేడు ఆ స్థితిని దాటేశారు. ఈ విషయం తాజాగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది.

అమ్మాయిలు ఒకరికంటే ఎక్కువ పురుషులతో ప్రేమాయణం నడపుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి నెట్వర్కింగ్ ద్వారా తమ పరిచయాలను మరింత బలపరుచకుంటున్నారట. మరోవైపు కాలేజీస్థాయిలో కుదిరిన స్నేహం ఒక ప్రేమికుడిని సంపాదిస్తే, వృత్తిరీత్యా ఉద్యోగంలో చేరిన చోట మరో లవర్‌ను తెచ్చి పెడుతోందట. దీంతో అమ్మాయిలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపేస్తున్నారట.

ఇటువంటి ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నవారిలో అమ్మాయిలే టాప్ అని సర్వేలో తేలింది. అమ్మాయిల్లో 18 శాతం మంది ఇద్దరు పురుషులతో ఏక కాలంలో లవ్వాట సాగిస్తుంటే కేవలం 15 శాతం మంది అబ్బాయిలు మాత్రం ఇటువంటి ప్రేమాయణాన్ని సాగిస్తున్నారట. మొత్తమ్మీద ప్రేమాయణంలోనూ అమ్మాయిలే ఫస్ట్ అనిపించుకుంటున్నారన్నమాట.

Recent Posts