Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఇషాంత్ శర్మకు అండగా నిలిచిన ధోనీ: జట్టులోనే కొనసాగుతాడట!





ఇషాంత్ శర్మకు కెప్టెన్ ధోనీ అండగా నిలిచాడు. మూడో వన్డే ఓటమికి కారణమైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి నాలుగు వన్డేలకు బిసిసిఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

చివరి నాలుగు వన్డేలకు ప్రస్తుత జట్టునే కొనసాగించాలని అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.

మూడు వన్డేల్లోనూ ఇషాంత్ శర్మ పరుగుల భారీగా సమర్పించుకున్నాడు. తీసిన వికెట్లు కూడా అంతంత మాత్రమే. 24 ఓవర్లు వేసిన 189 పరుగులు సమర్పించుకుని అతను రెండు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ జట్టులో కొనసాగినప్పటికీ తుది జట్టులోకి వస్తాడా, లేదా అనేది అనుమానమే.

ధోనీ అతనికి తుది జట్టులో స్థానం కల్పిస్తే అది పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటనే అవుతుంది. ఈ నెల 23వ తేదీ రాంచీలో నాలుగో వన్డే, 26వ తేదీన కటక్‌లో ఐదో వన్డే, 30వ తేదీన నాగపూర్‌లో ఆరో వన్డే, నవంబర్ 2వ తేదీన బెంగళూర్‌లో ఏడో వన్డే జరుగుతాయి. ఇషాంత్‌కు ధోనీ మద్దతు బౌలింగులో విఫలమవుతున్న ఇషాంత్ శర్మకు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్దతుగా నిలిచాడు.

ఇషాంత్ శర్మను ఒక ఆప్షన్‌గా వాడినట్లు ఆయన చెప్పాడు. అఫ్షనంటే తాను బౌలింగ్ చేయాల్సి ఉండిందని, ఉన్న ఆప్షన్లు ఏమిటో ఓసారి చూడండని, వినయ్ కుమార్ బౌలింగ్ చేశాడని, అతను కూడా పరుగులు ఇచ్చాడని, మారిస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నానని ధోనీ వివరించాడు.

Recent Posts