Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

చరణ్ ఓకే అంటే ‘జగదేకవీరుడు’ రీమేక్ చేస్తా


వీరు పొట్ల దర్శకత్వం లో మంచు విష్ణు హీరో గా నటించిన చిత్రం ‘దూసుకెళ్తా’. 17న విడుదలకు రెడీ అయింది. ఈ సందర్భంగా విష్ణు మీడియా తో మాట్లాడారు. నాన్నకు, మనోజ్‌కి దూసుకెళ్తా కథ బాగా నచ్చింది. వారిపై నమ్మకంతో కథ పూర్తిగా వినకుండానే నేరుగా సెట్స్‌కి వెళ్లిపోయా. షూటింగ్ జరుగుతుండగా ఈ కథపై ఆసక్తి పెరిగింది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేను ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించానని చిత్ర విశేశాలను చెప్పుకొచ్చారు.
ఇక రీమేక్ చిత్రాలపై తన ఆసక్తిని తెలియజేస్తూ .. నాన్నగారి సినిమాలను రీమేక్ చేయమని చాలామంది అడుగుతుంటారు. ‘రాయలసీమ రామన్నచౌదరి’ చిత్రాన్ని తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ చేయమంటే… రజనీకాంత్, విష్ణువర్థన్ లాంటి నటులే ధైర్యం చేయలేకపోయారు. ఇక నా వల్ల ఏమవుతుంది. అయితే… ‘అసెంబ్లీ రౌడీ’ మాత్రం చేస్తా. అలాగే… చిరంజీవిగారి ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’ అంటే నాకు చాలా ఇష్టం. చరణ్ దాన్ని చేస్తే బావుంటుంది. ఒకవేళ చరణ్ చేయకపోతే… ఆ అవకాశం నేను దక్కించుకుంటా’’ అని తన మనసులోని మాటను బయటపెట్టారు విష్ణు.

Recent Posts