Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కంప్యూటర్లోని డేటాను సీడీ లేదా డీవీడీలోకి కాపీ చేయటం ఏలా..?





మీ కంప్యూటర్‌లోని ముఖ్యమైన ఫైల్‌ను సీడీ లేడా డీవీడీలో భద్రపరుచుకోవాలనుకుంటున్నారా..?, పీసీలోని డేటాను సీడీ లేదా డీవీడీలోకి కాపీ చేయలంటే తప్పనిసరిగా ‘డేటా బర్నర్'అవసరం. మీ పీసీలోని ఆపరేటింగ్ సిస్టం డేటాను బర్న్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఏవిధమైన అప్లికేషన్‌ను మీరు డౌన్ చేసుకోనక్కర్లేదు. క్షణాల్లో మీ పని పూర్తవుతుంది. అదిఏలాగో చూడండి. డేటాను బర్న్ చేసేందుకు కావల్సిన సామాగ్రి: మీ పీసీలోని డీవీడీ/సీడీ బర్నర్ అప్లికేషన్, కొత్త డీవీడీ లేదా సీడీ.

స్టెప్ 1: ముందుగా సిద్ధంగా ఉంచుకున్న సీడీ లేడా డీవీడిని కంప్యూటర్ డీవీడీ/సీడీ డ్రైవ్‌లోకి అమర్చుకోవాలి. స్టెప్ 2: స్టెప్ 1 ప్రక్రియ విజయవంతం అయిన వెంటనే ‘స్టార్ట్' బటన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 3: అనంతరం ప్రోగ్రామ్స్‌లోకి వెళ్లండి. స్టెప్ 4: ప్రోగ్రామ్స్‌లో డీవీడీ/సీడీ బర్నర్ అనే ఐకాన్‌ను ఓపెన్ చేయండి. స్టైప్ 5: బర్న్ చేయలనుకుంటున్న సదురు ఫైల్‌ను డెస్క్‌టాప్ పై ప్రత్యక్షమై ఉన్న డేటా బర్నర్ విండోలోకి డ్రాగ్ చేయండి. అనంతరం, ‘బర్న్ ఫైల్స్ టూ డిస్క్' అనే బటన్‌ను క్లిక్ చేసి బర్నింగ్ ప్రక్రియను విజయవంతం చేయండి.

Recent Posts