Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ధోనీ ధనాధన్ వేస్ట్: ఫౌల్కనర్ ధాటికి ఆసీస్ విజయం





మొహాలీ:భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దూకుడుతో చేసిన సెంచరీ వృధా అయింది. ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో భారత్‌పై ఉత్కంఠభరితమైన మ్యాచులో విజయం సాధించింది. ఇషాంత్ శర్మ ఒక్క ఓవరులో ఫౌల్కనర్‌కు 30 పరుగులు సమర్పించుకోవడంతో భారత్ పరాజయం ఖాయమైంది. అతను 29 బంతుల్లో 64 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ మ్యాచు విజయంతో ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాలో 2-1 స్కోరుతో ముందంజలో ఉంది. మూడో వన్డేలో టాపార్డర్ తడబడినా మహేంద్ర సింగ్ ధోనీ పోరాటం చేయడంతో నిర్ణీత యాభై ఓవర్లలో భారత్ 303 పరుగులు చేసింది. మొహాలీలో మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆసీస్ ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ధోనీ(121 బంతుల్లో 139) చెలరేగి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ ఐదు సిక్సులు, 12 ఫోర్లతో ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ధోనీకి ఇది తొమ్మిదో సెంచరీ.
రెండో వన్డేలో భారీ భాగస్వామ్యం నెలకొల్పిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు మూడో వన్డేలో ఆకట్టుకోలేకపోయారు. జట్టు స్కోరు 11 వద్ద ఉన్నప్పుడు ధావన్(6 బంతులు 8 పరుగులు), 37 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్(22 బంతులు 11 పరుగులు) ఔటయ్యారు. దీంతో భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. సురేష్ రైనా(19 బంతుల్లో 17 పరుగులు), యువరాజ్ సింగ్(పరుగులు చేయకుండానే)లు వరుస బంతుల్లో ఔటయ్యారు. 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను కోహ్లీ ఆదుకున్నాడు. జోరుమీదున్న కోహ్లీని(73 బంతుల్లో 68 పరుగులు) మాక్సువెల్ పెవిలియన్‌కు చేర్చాడు. కోహ్లీ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జడెజా(4 బంతుల్లో 2 పరుగులు) త్వరగానే ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. టాపార్డర్ విఫలం కావడంతో సారథి ధోనీ పైన భారం పడింది. ధోనీ పోరాటం చేశాడు. అతనికి టాపార్డర్ అండగా నిలిచింది. తర్వాత వచ్చిన అశ్విన్(35 బంతుల్లో 28 పరుగులు) ఏడో వికెట్‌గా, భువనేశ్వర్ కుమార్(18 బంతుల్లో 10 పరుగులు) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నారు. మరోవైపు ధోనీ మాత్రం పోరాటం కొనసాగించాడు. 108 బంతుల్లో ధోనీ శతకం సాధించాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు జాన్సన్ 4, మెకే, వాట్సన్, ఫాల్కనర్, మాక్సువెల్‌లు తలో వికెట్ తీసుకున్నారు. కాగా, అంతకుముందు ఆస్ట్రేలియా మొహాలీలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ - ఆసీస్‌ల మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో ఇది మూడో వన్డే. తొలి రెండు మ్యాచుల్లో చెరో వన్డే గెలిచి 1-1తో సమానంగా ఆసీస్, భారత్‌లు ఉన్నాయి.

Recent Posts