Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

హీరోయిన్ రెజీనాలో ఏదో సమ్‌థింగ్ ఉందట... దానికోసమే కుర్రహీరోలు తెగ...

నిన్నగాక మొన్న తెరంగేట్రం చేసిన రెజీనా అవకాశాల్ని అందుకోవటంలో స్పీడు పెంచేసింది. చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎస్‌ఎంఎస్‌, రొటీన్‌ లవ్‌స్టోరీ సినిమాలతో టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల మీద ఏక కాలంలో దృష్టి పెట్టింది. 

ప్రస్తుతం తెలుగులో నారా రోహిత్‌తో 'శంకర', అల్లు శిరీష్‌తో 'కొత్త జంట', సాయిధరమ్‌ తేజతో ఒక సినిమా, సందీప్‌ కిషన్‌తో 'రారా కృష్ణయ్యా'... మొదలైన సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో ఓ రెండు పెద్ద ప్రాజెక్టులలో నటిస్తోంది. ఆమె స్పీడు చూస్తుంటే త్వరలోనే పెద్ద హీరోయిన్లకు ఝలక్‌ ఇచ్చేలా కనిపిస్తోంది. 

తాజా సమాచారం ఏంటేంటే పెద్ద పెద్ద హీరోల సినిమాల నుంచి కూడా రెజీనా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం రవితేజ నటించే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'బలుపు' సినిమా తర్వాత రవితేజ నటించే సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 

ఇందులో ఈ అందాల తారను మెయిన్‌ హీరోయిన్‌గానే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రవితేజ లాంటి పెద్ద హీరోతో నటించే ఛాన్స్‌ రావడం పట్ల రెజీనా ఫుల్‌ హ్యాపీగా వుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో నాలుగు, తమిళంలో రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా వుంది.

Recent Posts