Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నేను ప్రేమించే అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా? లేదా...?





చూశామా... ప్రేమించామా.. ఐలవ్యూ చెప్పామా అనే ఈ రోజుల్లో కూడా తమ ప్రేమను ప్రేయసికి చెప్పడానికి భయడేవారు కూడా లేకపోలేదు. తమ ప్రేమను చెప్పకుండా గుండెల్లో దాచుకుని సంవత్సరాల పాటు నిరీక్షిస్తుంటారు కొందరు యువకులు. అసలు తను ప్రేమిస్తున్న అమ్మాయి తనను ప్రేమిస్తుందా లేదా ఇంకెవరినైనా ప్రేమిస్తుందా.. ఒకవేళ తాను ఐ లవ్యూ చెప్తే కాదంటుందేమోనన్న సందేహాలతో తమ ప్రేమను చెప్పకుండా ఉండిపోతారు.

ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం... అన్నాడో సినీకవి. నిజమే మనసును దోచిన ప్రేయసి ఊహల్లో తనతో షికారు చేస్తున్నా నిజజీవితంలో మాత్రం తనను చూస్తేనే మండిపడుతుంటే సదరు ప్రేమికుని హృదయ వేదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి మనసుకు నచ్చిన ప్రేయసిని తనవైపుకు తిప్పుకోవాలంటే ప్రేమికుడు ఏం చేయాలి? మనసుకు నచ్చిన ప్రేయసి అసలు తనని ప్రేమిస్తుందా లేదా అన్న విషయాన్ని ప్రేమికుడు ముందుగా గ్రహించగలగాలి.

అమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెలుసుకునేందుకు వారి హావభావాలను, వారు ప్రవర్తించే తీరును బట్టి అర్థమవుతుంది. తొలిచూపులోనే ప్రేమిస్తున్నాని చెబితే ఏ అమ్మాయి అయినా ఒప్పుకోదు. అందుకు వారితో పరిచయం పెంచుకుని మెల్లగా మాట్లాడటం చేయాలి. వారు మాట్లాడే తీరును బట్టి అర్థం చేసుకోవాలి. కొంచెం చనువుగా మాట్లాడుతుంటే సదరు అబ్బాయి అంటే కొంచెం మంచి అభిప్రాయం ఉన్నట్టు.

ఒకవేళ పలుకరిస్తే చూసి చికాకు పడుతుంటే.. కారణానికి తగ్గట్టు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నించాలి. చాలామంది యువతులు ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని ప్రియుడి వద్ద చెప్పడానికి సిగ్గుపడతారు. అబ్బాయిలే ముందు చెప్పాలనేది వారి ఉద్దేశ్యం. అందుకే సందర్భాన్ని చూసి ధైర్యంగా చెప్పేయాలి.

ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు అని ప్రేమ పండితులు చెబుతున్న మాట. ఆమెను ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పాలి. నా గురించి అర్థమయ్యాకే నా ప్రేమకు పచ్చజెండా ఊపు అంటూ ప్రేయసి కూడా ఆలోచించే విధంగా ఆమెకు చెప్పి చూస్తే తప్పక ఫలితం ఉంటుంది.

Recent Posts