ప్రేమించిన అమ్మాయిని చూస్తే అంగం స్తంభిస్తోంది... కానీ మా ఫ్రెండ్స్...

ప్రశ్న: నాకు 25 ఏళ్లు. ఇప్పటివరకూ ఏ స్త్రీతోనూ లైంగిక సంబంధం లేదు. కానీ మా స్నేహితులు ఇలా సెక్స్ చేయకుండా ఉండటం వెనుక వేరే కారణం ఉందనీ, నాకు మగతనం లేదని గేలి చేస్తున్నారు. అంతేకాదు... పెళ్లి చేసుకుంటే భార్యను సుఖపెట్టలేనని కూడా అంటున్నారు.
నిజానికి నాకు అమ్మాయిలను చూస్తే సెక్స్ ఆలోచనలు వస్తాయి. ప్రత్యేకించి నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని చూస్తే అంగం స్తంభిస్తుంది. కానీ నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మా స్నేహితులు చెప్పే మాటలను చూస్తే నాకు భయమేస్తోంది. పెళ్లి చేసుకుంటే భార్యను సుఖపెట్టగలనా...?
సమాధానం: చాలామంది యువకులు ఇలాంటి సందేహాలతో సతమతమవుతుంటారు. సెక్స్ అనుభవం లేకపోతే పెళ్లయిన తర్వాత భార్యను సుఖపెట్టలేరంటూ కొందరు చెప్పే అసత్యపు మాటలకు భయపడిపోయి పక్కదారి పడుతుంటారు. కానీ యువకుడికి లైంగిక కోర్కెలు, అంగ స్తంభనలు ఉంటే పెళ్లయిన తర్వాత భార్యకు పూర్తిగా సెక్సులో తృప్తిని అందించగలుగుతారు. అంతేతప్ప సెక్స్ అనుభవం కోసం అంటూ పక్కదారి పట్టడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. అంగం స్తంభిస్తూ... సెక్స్ కోర్కెలు ఉన్నాయి కనుక ఎలాంటి బెంగ అవసరంలేదు.
You may also Like
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼