Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ప్రతి పురుషుడికీ లైంగికంగా లొంగిపోతున్నా.. ఇదేమైన జబ్బా?

నా పేరు సరోజ. నల్గొండ జిల్లా. నాలుగేళ్ల క్రితం భర్తకు విడాకులిచ్చా. ఆ తర్వాత చాలా మంది పురుషులతో ఎన్ని రాత్రులు గడిపానో లెక్కలేదు. దీనికి కారణం నాలోని బలహీనతే. నాతో సన్నిహితంగా ఉంటూ.. నన్ను కావాలని కోరిన ప్రతి పురుషుడుతో పాటు.. నేను ఇష్టపడిన, కోరుకున్న వ్యక్తికి లొంగిపోవడమే. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి. ఇదేమైనా జబ్బా? నాకో మార్గం చూపండి.?

మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి ఓ బలమైన కారణం ఉండివుంటుంది. మీ భర్త నుంచి దూరమైన తర్వాత ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొత్త అలవాటు చేసుకుని దానికి వ్యసనమై పోయారు. ఫలితంగా లెక్కలేనన్ని రాత్రులు పరాయి పురుషులతో గడిపారు. అంటే మీ భర్త ద్వారా లభించిన ప్రేమ, ఆదరణ, ఆప్యాయం, అనురాగం, దాంపత్య సుఖం ఇతరుల నుంచి పొందాలన్న తపనతో ఈ వ్యసనానికి లోనయ్యారు.

ఫలితంగా.. మీకు అవేవీ లభించిక పోగా.. సెక్స్‌లో కొత్తకొత్త అనుభవం దొరకడంతో దానికి అలవాటు పడిపోయారు. దీన్ని నుంచి బయటపడాలంటే.. మీలో బలమైన పట్టుదల, తగిన మనోనిబ్బరం, కల్మషం లేకుండా సాయం చేసే మనిషి మీకు తోడు కావాలి. ఇందుకోసం నిపుణులైన మానసిక వైద్య నిపుణులను సంప్రదించండి. అంతేకానీ ఇదే ప్రత్యేకించిన జబ్బేమీ కాదనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి.

Recent Posts