Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

భారత్‌పై ఆసీస్ విజయం: ఇషాంత్ శర్మే ఓటమికి బాధ్యుడు





గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ కోహ్లి వికెట్ తీసినప్పటికీ ఒకే ఓవర్లో ఏకంగా 18 పరుగులిస్తే అంతకుమించిపోయిన ఇషాంత్ ఏకంగా ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చి గెలిచే మ్యాచ్‌ను సర్వ నాశనం చేశాడన్న కామెంట్లు వినబడుతున్నాయి.

ఆరంభంలో కాస్త కట్టడి చేసినా చివర్లో ఇషాంత్ వ్యూహం లేని 48 ఓవర్ ఆసీస్ ఆటను గెలుపువైపుకి తిప్పేసింది. వెరసి 4 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 7 ఒన్డేల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యాన్ని సాధించింది.

304 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్‌కు మొదట్లో అంతగా కలిసి రాలేదు. హగ్స్ 40 బంతుల్లో 20 పరుగులు, ఫించ్ 38, వాట్సన్ 11, బెయిలీ 43 చేసి ఔటయ్యారు. ఐతే వోగ్స్ మాత్రం వికెట్ల వద్ద పాతుకుపోయాడు. 76 పరుగులతో నాటవుట్‌గా నిలిచాడు. మాక్సువెల్ 3, హ్యాడిన్ 24 త్వరగానే ఔటై పోయారు.

కానీ ఫక్నర్ జూలు విదిల్చి కేవలం 29 బంతుల్లో 64 పరుగులు రాబట్టాడు. ఇతడు ఇషాంత్‌కు చుక్కలు చూపించాడు. 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉతికి టీమిండియాకు దక్కాల్సిన విజయాన్ని ఆసీస్‌కు దక్కేట్లు చేశాడు.

Recent Posts