Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోహా.. ఏంటా చూపించడం... చెల్లిపై మండిపడ్డ సైఫ్... భార్య కరీనాకు క్లాస్





సైఫ్ అలీఖాన్ కొత్తగా సంప్రదాయ ముసుగు తొడుక్కున్నాడంటున్నారు బాలీవుడ్ సినీజనం. అసలు విషయం ఏంటయా అంటే, కొత్తగా వచ్చిన 'సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగస్టర్ 2' చిత్రంలో సైఫ్ చెల్లి సోహా అలీఖాన్ తన లేత అందాలన్నిటినీ శుభ్రంగా చూపించేసిందట. షూటింగ్ సమయంలో ఆమె ఎలా నటించిందన్న సంగతి తెలీదు కదా... సినిమా ప్రివ్యూలో సోహా నటనను చూసిన సైఫ్ పళ్లు పటపట కొరికాడట.

సీట్లోంచి పైకి లేచి వెంటనే సోహాను బయటకు పిలిచి క్లాస్ పీకాడట. ఏంటా చూపించడం... కుటుంబం గట్రా గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్.. అంటూ అదేపనిగా బాదుడే బాదుడట. అంతే.. సైఫ్ సుత్తి బాదుడుకు సోహా గుడ్లు తేలేసిందట.

అక్కడే ఉన్న వొదిన కరీనా కలుగజేసుకున్నదట. అంతే... ఖయ్‌మని రంకెలేస్తూ కరీనాకు కూడా పాఠం చెప్పడం మొదలెట్టాడట. కరీనా మాత్రం... ఈ మొగుళ్లున్నారే... అన్న టైపులో ముఖం పెట్టి చిట్లించుకుంటూ వెళ్లిపోయిందట. అదీ సంగతి.

Recent Posts