Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆమె ముందు సమంత కూడా దిగదుడుపు

హీరోయిన్స్‌ ఎక్కువమంది లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండడంతో అగ్ర తారలందరికీ కొమ్ములొచ్చేశాయి. ఎంత పెద్ద స్టార్‌ సినిమాలో ఆఫర్‌ ఇచ్చినా కానీ వారు పెద్దగా లెక్క చేయడం లేదు. కథ, కాకరకాయ కాకుండా కాసులకే ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం నయనతారకి సినిమాకి వచ్చి కోటిన్నర ఇస్తున్నారట..
ఇంత డిమాండ్‌ మరే హీరోయిన్‌కీ లేదనేది టాలీవుడ్‌ టాక్‌. చివరకు సమంత కూడా ఇంతకంటే తక్కువకే చేస్తోందట. అటు యువ హీరోలు, ఇటు సీనియర్ల సరసన ఇమిడిపోయే నయనతారకి నటిగా కూడా మంచి పేరుండడంతో అది మరింత అడ్వాంటేజ్‌ అయింది. 

'కహానీ' తెలుగు, తమిళ్‌ రీమేక్‌కి అయితే ఆమెకి రెండున్నర కోట్లు ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. తన డిమాండ్‌ ఏమిటనేది బాగా అర్థమైపోవడంతో ఇక నయనతార ఏమాత్రం దిగి రావడం లేదట. అనుష్క, త్రిషలతో పోలిస్తే నయనతార మరీ ఎక్కువ చిత్రాల్లో నటించకపోవడం పెద్ద ప్లస్‌ అయింది. ఇంకా ఫ్రెష్‌ అనిపించడం వల్ల ఆమెపై కోట్లు కుమ్మరిస్తున్నారు.

Recent Posts