Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు.





ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. ముంబై జుహులోని ఆమె నివాసంలోకి చొరబడి ఖరీదైన మ్యూజిక్ సిస్టమ్, ఐపాడ్ దోచుకెళ్లారు. పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్ర ఇంట్లో లేరు. శిల్పాశెట్టి ఇంటి మేనేజర్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 16న జుహు పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జుహు పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా తమ కొత్త సినిమా ప్రాజెక్టు ‘దిశ్‌‌కియోంకా' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వారు తమ సొంత బ్యానర్ అయిన ఎస్సెన్సియల్ స్పోర్ట్స్ అండ్ మీడియా ప్రై.లి. బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసారు

Recent Posts