Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆయనకు అది లేనిదే నిద్ర పట్టదు.. నాకే అనాసక్తి... ఏం చేయాలి?





నా పేరు కావ్య. నెల్లూరు. నాకు వివాహమై యేడాదిన్నర అయింది, ఆరు నెలల పాప ఉంది. పాప పుట్టక ముందు శృంగారంలో అమితాసక్తితో పాల్గొనేదాన్ని. ఇప్పుడు శృంగారం అంటే విముఖంగా ఉంటోంది. మావారికి అది లేనిదే నిద్ర పట్టదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చెపితే వినిపించుకోవడం లేదు. పొద్దస్తమానం సైగలతో చంపుకుతింటున్నారు. ఏం చేయాలో చెప్పండి?

సాధారణంగా పిల్లలు పుట్టాక చాలామంది స్త్రీలకు శృంగారంలో ఆసక్తి తగ్గుతుంది. కారణాలు చాలా వుంటాయి. కొత్తగా వచ్చిన పసిపాప బాధ్యత, 24 గంటలూ పాపమీదే మనసు కేంద్రీకరించడంతో రాత్రుళ్లు నిద్ర తక్కువగా ఉండటం, ఇవిగాక ప్రసవానంతరం శరీరంలో వచ్చే మార్పులు కూడా శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి.

పైపెచ్చు.. చిరాకు, కోపం, సెక్స్‌ పట్ల విముఖత పెంచుతాయి. మనసు, శరీరం రెండూ కూడా అలసిపోవడం వంటి కారణాలతో సెక్స్‌ పట్ల విముఖత ఏర్పడే అవకాశం లేకపోలేదు. మగవారు కూడా ఆడవారి మానసిక, శారీరక స్థితులను అర్థం చేసుకుని నడుచుకోవాల్సి ఉంటుంది. పాప పెంపకంలో ఇంటి పనుల్లో తండ్రిగా, భర్తగా సమాన బాధ్యతలు పంచుకుంటూ చేదోడువాదోడుగా ఉండాలి. అది అతని కనీస బాధ్యత అని చెప్పండి. పాప పెద్దయ్యేంత వరకు ఓపిక పట్టమని చెప్పండి.

Recent Posts