Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శింబు - హన్సిక కటీఫ్... బాగా వాడుకొని వదిలేశాడట!

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ నడుస్తుండడం సహజమే. అయితే తారల మధ్య ఉండే రిలేషన్ ఒక సినిమాకి మరో సినిమాకి ఉన్న గ్యాప్ వరకు తప్ప నిజ జీవితంలో అవి ఏ మాత్రం వర్క్అవుట్ కావటం లేదు. తాజాగా నిన్నటి వరకు ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన హన్సిక, శింబుల ప్రేమ బెడిసి కొట్టిందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

కోలీవుడ్ ప్రేమ జంట శింబు - హన్సికలు ఇప్పుడు విడిపోయారట. వీరి ప్రేమబంధం కటీఫ్ అయిపోయిందని కొందరు అంటున్నారు. ఈ వార్తలను నిజం చేసేలా హన్సిక ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే అర్థమవుతుంది. వచ్చే ఐదారేళ్ళ వరకు తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటూ సదరు ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ ప్రకటించింది. 

గతంలో శింబు హీరోయిన్లతో ఎఫైర్ నడిపి వాళ్ళను వాడుకొని వదిలేసి సందర్బాలు చాలా ఉన్నాయి. హన్సికకి మాత్రం తనకిప్పుడు జస్ట్ 22 ఏళ్లనీ, పెళ్లి చేసుకోవాలంటే మరో ఐదారేళ్ళేనా పడుతుందనీ చెప్పింది. ఇంకా విస్మయం కలిగించే అంశం ఏమిటంటే, శింబుతో పెళ్లి గురించి అడిగితే, భవిష్యత్తు గురించి ముందుగానే చెప్పలేమనీ, ఐదారేళ్ళ తర్వాత ఏం జరుగుతుందన్నది తనకు తెలియదనీ తేల్చేసింది.

దీనిని బట్టి చూస్తే శింబుతో హన్సిక ప్రేమ వ్యవహారం బెడసికొట్టిందని కొందరు చెబుతున్నారు. గతంలో శింబు చాలా మందితో ప్రేమాయణం నడిపి వారిని బాగా వాడుకొని వదిలేశాడని టాక్ ఉంది. మరి ఇప్పుడు హన్సికను కూడా వాడుకొని విదిలేశాడని, ఇంకా ఎంతమందితో మన గురుడు ప్రేమాయణం నడుపుతాడు అంటూ కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Recent Posts