Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

హృతిక్ రోషన్ 'క్రిష్ 3' మేకప్ కష్టాలు... మూడు గంటలు నిటారుగా....

సినిమాల్లో తమ పాత్రలను పోషించడానికి ఆయా ఆర్టిస్టులు ఎంతగా కష్టపడతారో... అంతకుమించి ఆయా గెటప్పుల మేకప్ కోసం కూడా కష్టపడుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఓ పాత్ర కోసం అలాగే కష్టపడుతున్నాడు. 'క్రిష్ 3' సినిమాలో తాను పోషిస్తున్న రోహిత్ పాత్ర కోసం, కథలో భాగంగా వయసుమీరిన వాడిగా కనిపించాలి. అందుకోసం మేకప్ విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నాడు.

ఇలాంటి మేకప్ విషయంలో నిపుణుడైన విదేశీ టెక్నీషియన్ మైక్ స్ట్రింజర్ సేవలు పొందుతున్నాడు. ఈ మేకప్ కోసం ప్రతిరోజూ మూడుగంటల సమయం పడుతోంది. ఉదయం 9 గంటల కాల్‌షీట్‌కి హాజరవడానికి పొద్దున్నే ఆరు గంటలకే మేకప్‌కి కూర్చుంటున్నాడు. పైగా ఆ మూడుగంటలూ నిటారుగా కదలకుండా కూర్చోవాలట. దీంతో నడుం నొప్పితో పాటు పలురకాల సమస్యల్ని హృతిక్ ఎదుర్కొంటున్నాడట. అయితే, క్యారెక్టర్ కోసం ఆ మాత్రం బాధలు తప్పవని అంటున్నాడు ఈ హీరో.

Recent Posts