Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కోహ్లి - ధావన్ మళ్లీ ఉతికారు.. చెరో 115 - 100... భారత్ విజయం

ధావన్, విరాట్ కోహ్లి వీరవిహారం చేయడంతో భారత్ జట్టు ఆసీస్ పై భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. శర్మ, ధావన్ ఓపెనర్లుగా జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. శర్మ 89 బంతుల్లో 79 పరుగులు చేయగా ధావన్ సెంచరీ చేసి ఫాల్కనర్ బంతికి చిక్కాడు. అనంతరం కోహ్లీ తనదైన ఆటతీరుతో ఆసీస్ బౌలర్లపై విరుచుకపడ్డాడు.

కేవలం 66 బంతుల్లో 18X4, 1X6కొట్టి 115 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. రైనా 16 పరుగులకు, యువరాజ్ డకౌట్ గా వెనుదిరిగారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ కోహ్లికి చక్కటి సహకారాన్ని అందించాడు. ధోనీ 25 పరుగులు చేశాడు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే 351 లక్ష్యాన్ని చేరుకున్నారు.

అంతకుముందు ఆస్ట్రేలియా ధాటిగా ఆడి భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆసీస్ 350 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు విఫలమైప్పటికీ టాపార్డర్ రాణించడంతో భారీ స్కోరు సాధించింది.

బెయిలీ (156) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించగా అతనికి వాట్సన్ (102) చక్కని సహకారమందించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అమూల్యమైన 168 పరుగులు జోడించారు.

ఇక ఐదో వికెట్‌కి వోగ్స్ (44 నాటౌట్)తో కలిసి బెయిలీ 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, షమి చెరో వికెట్ తీసుకున్నారు.

Recent Posts