Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శృంగార సామర్థ్యం సన్నగిల్లిందా..? పడకగదిలో భాగస్వామి గేలి చేస్తుందా..?

రాత్రవుతుంటే శృంగారంలో విఫలమవుతామనే భయం వేస్తుందా? బెడ్రూంలోకి అడుగుపెట్టాలంటే భాగస్వామి గేలి చేస్తుందని సిగ్గుగా ఉందా? జీవిత భాగస్వామితో జరిగే శృంగార పోరాటంలో వెనుకబడుతున్నారా..?! శృంగార ప్రేరేపిత మందుల కోసం పరుగులు పెడుతున్నారా?! అయితే ఇకపై అక్కడే ఆగిపోండి.

కాస్త దానిమ్మ రసముంటే చాలు దమ్ముకు దమ్ము... ఆరోగ్యానికి ఆరోగ్యం... రోజూ ఒక్క గ్లాసు దానిమ్మ రసం లాగిస్తే ముడుచుకుపోయే శరీరం నవయవ్వనంగా విచ్చుకుంటుంది. లండన్ పరిశోధకులు చెప్పిన సత్యం ఇది. దానిమ్మపై పరిశోధనలు చేసిన వారు అందులో శృంగార ప్రేరేపిత ఔషధ గుణాలున్నాయని కనిపెట్టారు.

పండ్లు మన దైనందిన ఆహారంలో భాగమయ్యాయి. రకరకాల పండ్లు కాయలను మనం ఆయా రుతువుల్లో తింటుంటాం. ప్రతి పండు లేదా కాయలో మేలు చేసే ఔషధాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఔషధాలు శరీరానికి శక్తిని కూడా ఇస్తున్నాయి. ఇందులో దానిమ్మ చేసే మేలు అంతాఇంతా కాదు. దానిలోని గింజలను ఒలుచుకునే ఓపిక ఉండాలేగానీ, అంతటి ఆరోగ్యం లభిస్తుంది.

దానిమ్మ రసంలో శృంగార రసాన్ని పెంపొందించే లక్షణాలున్నాయని తేలింది. సాధారణంగా శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుందనేది వైద్యశాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెపుతున్నారు. అలాగే కొన్నిరకాల కేన్సర్లకు కూడా విరుగుడగా నిలుస్తుందనేది ఎప్పుడో తేలిపోయింది.

అలాగే దీనిలో హృద్రోగాలకు సంబంధించిన రోగాలను నివారించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ రసాన్ని తీసుకోవడం వలన రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుందనేది సత్యం. అయితే చాలాకాలం తరువాత ఇందులో ఇంకొన్ని ఔషధ గుణాలున్నాయని పరిశోధనలు తేల్చేశాయి.

దానిమ్మ గింజల రసాన్ని సేవిస్తే గుండెకు మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో భాగంగా అది రక్తాన్ని శృంగార ప్రేరేపిత అవయవాలకు ప్రసారం చేస్తుంది. దీంతో అవి ప్రేరేపితమవుతాయని పరిశోధకులు తెలిపారు. కనుక దానిమ్మ పండును తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

Recent Posts