Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

దీపికా పదుకొనే పెళ్లికి మగాడు కరువు ... అయినా తల్లి కాబోతుంది!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇప్పుడు తల్లి కాబోతుందంటూ బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ముద్దుగుమ్మకు ఎప్పుడు పెళ్లయింది, రహస్యంగా పెళ్లి చేసుకొని తల్లి కాబోతుందా అని ఆశ్చర్యపోకండి. ఎప్పుడూ ఎఫైర్లు నడిపే దీపికా ఇప్పుడు ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ సమాచారం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన పెళ్లిపై వచ్చిన రూమర్లపై స్పందించింది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, చూపంతా కెరియర్‌పైనే ఉందని, జీవితంలో ఇంకా స్థిరపడలేదని అంటూ చెప్పుకొచ్చిన ఆమె తనకు ఇంతవరకు కావాల్సిన మగాడే ఎదురుపడలేదని, కాబోయే వాడికి కొన్ని ప్రత్యేకతలు ఉండాలని, అలాంటి మగాడు తారసపడితే ఖచ్చితంగా ప్రేమిస్తానని చెప్పింది.

ఇక మీడియాలో మాత్రం పెళ్లిపై రూమర్లు రావడం చూసి ఆశ్చర్యపోయానని, తనను పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్ళ నుండి కూడా ఒత్తిడిలేదని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాలు మరో విధంగా అంటున్నాయి. అసలు దీపికాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అందుకే ఓ బిడ్డను దత్తత తీసుకుంటుందని అంటున్నారు.

Recent Posts