Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

‘రామయ్యా వస్తావయ్యా’...ఇదీ లాభనష్టాల లెక్క!


హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు గట్టెక్కుతాడా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత చెబుతున్న వివరాలను పరిశీలిస్తే సినిమా పెట్టబడి రికవరీ చేస్తుందనే నమ్మకం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారట. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు దిల్ రాజు సంతోషంగానే ఉన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...‘సినిమాకు స్పందన బాగుంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 20 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజుల్లో సినిమా పెట్టుబడి తిరిగి వస్తుంది. ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఎంతో సంతోషంగా ఉన్నాను' అని దిల్ రాజు మీడియాకు వెల్లడించారు. ఈ చిత్రంలో ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత,శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు.

Recent Posts