Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నందినీరెడ్డి చాలా ఘాట్‌ గురూ... సినీ ఆఫర్ రావాలంటే...





నందినిరెడ్డి 'అలా మొదలైంది' చిత్రంతో పేరు తెచ్చుకుంది.... అంతకుముందు అమృతం టీమ్‌లో గుణ్ణం గంగరాజుతో కలిసి పనిచేసింది. హ్యూమర్‌కు బాగా ప్రిఫరెన్స్‌ ఇచ్చే ఈమె తన అనుభవాన్ని అలా మొదలైందిలో చూపించింది. ఆ చిత్రం సక్సెస్‌ తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువలా రావాలి. కానీ.. అవేవీ రాలేదు. దానికి కారణం చాలా ఉంది. ఆమెకు ఇంకా పరిపక్వత లేదని కొందరంటున్నారు. ఆమె సక్సెస్‌ చూడగానే బెల్లంకొండ సురేష్‌ కర్చీఫ్‌ వేసేశాడు. అది 'జబర్‌దస్త్‌' సినిమాతో ఫెయిల్‌ అయింది.

రెండో సినిమానే ఫెయిల్‌ కావడంతో ఆమె నిర్మాతల చుట్టూ తిరిగింది. కానీ ఎవ్వరూ ముందుకు రావడంలేదు. కొందరేమో తెలివిగా హీరోల డేట్స్‌ తెచ్చుకో అంటూ దాటవేశారు. దాంతో చిర్రెత్తిపోయిన ఆమె... ఇటీవలే అంతకుముందు ఆ తర్వాత 50 రోజుల ఫంక్షన్‌లో ఘాటుగా స్పందించింది. నిర్మాతలు కథలు వినకుండా హీరోలపై ఆధారపడటంతో తెలుగు సినిమా ఇలా తయారైందని చెప్పింది. కథనాయకులకు తగినట్లుగా కథలు రాసుకుంటే.. ఇక తెలుగు సినిమా బాగుపడేదెప్పుడూ అంటూ వ్యాఖ్యానించింది.

దేనికైనా కథే గొప్పది.. ఆ విషయం నిర్మాతలు తెలుసుకోవాలని సూచించింది. హాయిగా యాభైరోజుల వేడుకలో ఇదేమి ప్రసంగం అని కంగారు పడకండి. ఆ చిత్ర నిర్మాతే ఆమెకు తొలి అవకాశం ఇచ్చింది. తను నిర్మాతగా కథ, నటీనటుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ విషయాన్ని ఆమె హైలైట్‌ చేయడానికి అలా మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయితే దానివల్ల ఆమెకు సినిమాలు వచ్చే అవకాశం ఎలా ఉన్నా... ఈమెతో సినిమా చేయం చాలా కష్టం గురూ.. అనేంత వరకు నిర్మాతలు వచ్చేశారని సమాచారం. ఇక రెండో సినిమా కూడా అలా మొదలైంది నిర్మాతే ఇవ్వనున్నట్లు సమాచారం. చూద్దాం.. ఈసారి ఎలాంటి సినిమా చేస్తుందో.

Recent Posts