Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆర్తీ అగర్వాల్‌లా కాజల్ అగర్వాల్... త్రిష కంటే ముదురా...





ఇటీవల కాలంలో హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉంది కాజల్‌ అగర్వాల్‌. దాదాపు అందరు హీరోలతో నటించేసింది. హిందీ, తమిళంలో నటించడం వల్ల తెలుగులో తగ్గిపోయాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమధ్య కాజల్‌, ఒకప్పటి సెక్సీనటి ఆర్తీ అగర్వాల్‌లా లావవడంతో కెరియర్‌ డల్‌ అయిందని తెలుస్తోంది.

బాద్‌షా చిత్రంలో ఎన్‌.టిఆర్‌కు అక్కలా కన్పించిందని అభిమానులు అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే తనను తాను మార్చుకోవడం కోసం తగ్గకుండా అలానే ఉండటంతో యువ హీరోలు పక్కన పెద్దదిలా కన్పిస్తుందట. తమిళంలో కార్తీక్‌, విజయ్‌ సరసన నటిస్తోంది.

అయితే అందులో ఒక్కటే ఆమెకు దక్కింది. విజయ పక్కన మరీ పెద్దదిలా కన్పిస్తుందని వద్దన్నారని తెలుస్తోంది. అదేవిధంగా కమల్‌ పక్కన లింగుస్వామి అడిగితే... రెమ్యునరేషన్‌ కోసం వదులుకుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి తనకు తానుగా హ్యాపీగా ఉండేలా చూసుకుంటున్నాననీ... ఎవరికోసం కష్టపడి చేయాల్సిన పనిలేదని స్టేట్‌మెంట్‌ ఇస్తోంది. మరోవైపు త్రిష కంటే ముదురుగా ఉందా ఏంటి అని ఆమె సన్నిహితులు గొణుగుతున్నారట.

Recent Posts