Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కాజల్‌కు డబ్బుపై మోజు... తమన్నాకు బాలీవుడ్ పిచ్చి...శృతిహాసన్‌కు ఇగో!

ప్రస్తుతం అగ్రీ హీరోయిన్లు తెలుగు సినిమాలు చేయడం తగ్గించుకుంటున్నారు. తెలుగు సినిమాల ద్వార మంచి పేరుతెచ్చుకున్న మన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బాలీవుడ్ బాటపడుతున్నారు. తెలుగు నిర్మాతులు తమ సినిమాలో నటించమని అడిగితే ఎదోఒక షాక్ చెప్పి తప్పించుకుంటున్నారట.

తాజాగా పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్-2 సినిమాకు, మహేష్ ఆగడు సినిమాకు హీరోయిన్ కొరత ఎర్పడినట్లు టాలీవుడ్ సమాచారం. పవన్ సినిమాకు మొదట సమంతాని అనుకున్నారట కాని సమంత ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉండటంతో నో చెప్పిందట. అయితే కాజల్‌ని సంప్రదిస్తే తనకు కోటి రూపాయలకు కావాలని డిమాండ్ చేసిందట. 

అందుకు సదరు నిర్మాత అంత పారితోషికం ఇచ్చుకోలేనని వెనక్కి వచ్చేశాడట. ఇదిలా ఉంచితే మహేష్ '1 నేనొక్కడినే' సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' అనే సినిమా చేయనున్నాడు. అందుకు ఇందులో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను బుక్ చేసుకున్నారు. దీనికి శృతిహాసన్ కూడా ఒప్పుకుందట. 

అయితే ఇందులో రెండో హీరోయిన్‌గా తమన్నా పేరు పరిశీలించడంతో శృతిహాసన్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకుందట. ఎందుకంటే బాలీవుడ్‌లో అవకాశాలు కోసం ఈ ఇద్దిరిముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకే శృతి ఇగో ఫీలై మహేష్ ఆగడుకు నో చెప్పిందట. వీరందరికి విరుద్దంగా తమన్నా ఒక్క తెలుగు సినిమా కూడా ఒప్పుకోవడం లేదు. 

ప్రస్తుతం తమన్నా దృష్టాంతా బాలీవుడ్ పైనే పెట్టిందట. దీనిని బట్టి చూస్తుంటే కాజల్‌కు డబ్బుపై మోజని, తమన్నాకు బాలీవుడ్ పిచ్చిపట్టుకుందని, శృతిహాసన్‌కి ఇగోఅని వీరిపై టాలీవుడ్‌లో రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

Recent Posts