Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మహేష్ స్పేషాలిటి పవన్ సొంతం అయింది ..




ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా మహేష్ పవన్ ల గురించిన వార్తలే. టాలీవుడ్ ట్రెండ్ సెట్టేర్స్ గా వెలుగు వెలిగిపోతున్న ఈ ఇద్దరూ కాల్ షీట్స్ ఇస్తే చాలు తమ జీవితాలు బాగుపడిపోతాయని ఎందరో నిర్మాతలు, దర్శకులు వీరి వెంట పడుతున్నారు. ఈనేపధ్యంలో మొన్న మొన్నటి వరకూ క్రేజీ హీరోయిన్స్ అంతా తమ కెరియర్ కు బ్రేక్ ఇచ్చే దేవుడిగా మహేష్ ని ఆరాధించే వారు..
ఇలియానా, కాజల్, సమంత లాంటి ఎందరో హీరోయిన్స్ కెరియర్ గ్రాఫ్ ను మార్చేసిన హీరోగా మహేష్ రికార్డు కెక్కాడు.

గతంలో నటించిన నికీషా పటేల్, సారా జానీ, శ్రియా లాంటి హీరోయిన్స్ పవర్ స్టార్ తో నటించనా వారి కెరియర్ కు బ్రేక్ పడలేదు. కానీ అనుకోకుండా పరిస్థితులు తారుమారై గబ్బర్ సింగ్ రాకతో అప్పటిదాకా ఐరన్ లెగ్ ఇమేజ్ ఉన్న శ్రుతిహాసన్ కు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఇమేజ్ ఇవ్వడం అలాగే ఒక్క హిట్ కూడా లేని ప్రణితను సూపర్ హిట్ హీరోయిన్ గా మార్చడంలో పవన్ ఇమేజ్ విపరీతంగా ఆ హీరోయిన్స్ ఇద్దరికీ ఉపయోగపడడంతో ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ లలో నటిస్తున్న హీరోయిన్స్ అందరూ పవన్ పిలిస్తే చాలు తమ జీవితం ధన్యం అని అనుకునే స్థాయికి వచ్చారని ప్రస్తుతం మారిపోయిన వాతావరణంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ స్పెషాలిటీని హీరోయిన్స్ ల విషయంలో పవన్ సొంతం చేసుకున్నాడు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరి రాబోతున్న మహేష్ కొత్త సినిమా ‘1’ సినిమా ద్వారా ఆసినిమాలో నటిస్తున్న కొత్త హీరోయిన్ కీర్తీ సనన్ కు ఎటువంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి…

Recent Posts