Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్సీ హీరోయిన్ రంభ పెళ్లి పెటాకులైందా?





చెన్నై: రంభ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే....ఆ మధ్య ఓ ఎన్నారై బిజినెస్ మేన్‌ను పెళ్లాడిన రంభ ఇప్పుడు ఆయనతో విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుడ్ న్యూస్ ఏమిటంటే రంభ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే...ఆమె మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిందని, ప్రస్తుతం ఆమె భర్తతో విడిగా ఉంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విదేశాల నుంచి తిరిగి వచ్చి చెన్నైలోనే ఉంటోందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినిమా వాళ్లు సినిమా ఆఫర్లతో ఆమె వద్దకు వెలుతున్నారట. కెనడాలో సెటిలైన ఎన్నారై బిజినెస్‌మేన్ ఇంద్రన్ పద్మనాథన్‌ను రంభ ఏప్రిల్ 8, 2010లో వివాహ మాడింది. తిరుపతిలో వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భర్తతో కలిసి టోరంటో వెళ్లి పోయింది. ఈ దంపతుల దాంపత్యానికి గుర్తుగా జనవరి 14, 2011న ఆడ పిల్ల జన్మించింది. 2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుందని వార్తలు వెలువడ్డాయి. కానీ రంభ అప్పుడు ఈ వార్తలను ఖండించింది. భర్త ఇంద్రన్, కూతురు లావణ్యతో టోరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది. మళ్లీ తాజాగా రంభ భర్తతో విడిపోయినట్లు రూమర్లు గుప్పుమన్నాయి. ఆమె తిరిగి చెన్నైరావడం, సినిమాల్లోనటించాలనే నిర్ణయానికి రావడం ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తున్నాయి. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.
.

Recent Posts