Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ల్యాప్‌టాప్ నుంచి మొబైల్ ఫో‌న్‌కు ఇంటర్నెట్ పొందటం ఏలా..?





మొబైల్ ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు అనుసంధానించుకుని అంతరాయంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చా..?, అవను... ప్రదేశంతో పనిలేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను ల్యాపీతో కనెక్ట్ చేసుకుని పెద్దతెర పై ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చు. మొబైల్ హ్యాండ్‌సెట్‌‍ను ల్యాప్‌టాప్‌కు జతచేసుకునే ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకునే మార్గాలను ముందుగా మీరు తెలుసుకోవల్సి ఉంది.

ముందుగా మీరు వాడే ఫోన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మోడెమ్ డ్రైవర్‌ను ల్యాప్‌టాప్‌లో ఇన్స్‌టాల్ చెయ్యాల్సి ఉంటుంది. సదురు సీడీ మీ దగ్గర లేనట్లయితే ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్‌ను ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసిన వెంటనే డెస్క్‌టాప్ పైకి కాపీ చేసుకోండి. ఫోన్ మోడెమ్ యాక్టివేట్ అయిన అనంతరం యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు జతచేయండి. కొద్ది సెకన్లలనే కనెక్షన్ యాక్టివేట్ అవటంతో పాటు ఫోన్ మోడెమ్‌లా స్పందించటం ప్రారంభిస్తుంది. కనెక్షన్‌ను సెటప్ చేసుకునేందుకు యూజర్ కంట్రోల్ ప్యానల్‌లోకి ప్రవేశించి ‘సెటప్ ఏ కనెక్షన్ ఆర్ నెట్‌వర్క్' (Set up a connection or Network)ఆప్షన్‌ను ఎంచుకుని, కనెక్షన్ టైప్స్‌లో భాగంగా ‘Set up a dial up connection' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాతి పేజీలో డయల్ అప్ కనెక్షన్ ఎంట్రీ ఫీల్డ్ లో ‘#777'నెంబర్‌ను ఎంటర్ చేసి తరువాతి సూచలను అనుసరంచాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి సెట్టింగ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలసుకోవచ్చు.


Recent Posts