Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

హీరో హవీష్‌ను పీల్చి పిప్పి పిప్పి చేసేశారట





హీరో హవీష్‌ను పీల్చి పిప్పి పిప్పి చేసేశారట. 'జీనియస్‌' చిత్రంతో డైరెక్టర్‌ అయిన ఓంకార్‌ దాని గురించి మూమూలుగా చెప్పలేదు. తెలుగు సినిమా గతిని మార్చేసే చిత్రమన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చాడు. దానికి రచయిత చిన్నికృష్ణ అయితే ఈ చిత్రం విడుదలయితే, రాష్ట్రం అట్టుడికిపోతుంది. రగిపోతుంది. విశ్వవిద్యాలయాల్లో యూత్‌ చేసే గొడవకు రాజకీయనాయకులు బెంబేలెత్తిపోతారంటూ... స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని రెండేళ్ళనాడు లాంఛనంగా ప్రారంభించారు.

అప్పుడూ ఓంకారే, చిన్నికృష్ణలే ఉన్నారు. ఓంకార్‌ తమ్ముడు హీరోగా ప్రసాద్‌ ల్యాబ్‌లో ఆర్భాటంగా లాంచ్‌ చేశారు. భారీబడ్జెట్‌ వల్లనేమో, ఓంకార్‌పై నమ్మకంలేకనో ఆ చిత్ర నిర్మాత ఒకరు జారుకున్నారు. కాలక్రమంలో అది మరుగునపడింది. మళ్ళీ రెండేళ్ళకు హవీష్‌ అనే హీరోతో ఆ కథ ముందుకు వచ్చింది. బహుశా ఈ తతంగం హవీష్‌కు తెలిసి ఉండకపోవచ్చు.

దాసరి కిరణ్‌కుమార్‌ ఈ చిత్ర నిర్మాతగా పేరు వేసుకున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు నిర్మాత కోనేరు లక్ష్మయ్య కాలేజీ చైర్మన్‌ హవీస్‌ తండ్రి సత్యనారాయణ. కానీ తన తండ్రికి ఏమీ సంబంధం లేదని హవీష్‌ స్టేట్‌మెంట్లు ఇచ్చినా.. నిర్మాణపు వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకునేవారని యూనిట్‌ చెప్పేది. అసలు కథ ఏమటే... ఈ చిత్రానికి 12 కోట్లు ఖర్చయ్యాయి.
చిన్నపాటి హీరోతో ఇంత ఖర్చు అవసరమా? అంటే అది చిన్నికృష్ణ, ఓంకార్లకే తెలుసని అంటున్నారు. హవీష్‌ను వారు పిప్పి పిప్పి చేసి వదిలారని ఫిలింనగర్‌ కథనం.

Recent Posts