Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

చూపించి చూపించీ విసుగెత్తింది... అందుకే ఇక నటిస్తా: నథాలియా

కొన్ని పాత్రలు పోషించాక... ఆ నటీనటులకు వాటిపై మొహంమొత్తుతుంది. తన అందచందాలతో బాలీవుడ్‌ను అలరించిన జర్మనీ పోర్న్‌స్టార్‌ నథాలియా కౌర్‌ ఇకపై తాను అటువంటి క్యారెక్టర్లు చేయననీ, డాన్స్‌లు వేయనని అంటోదట. రామ్‌గోపాల్‌ వర్మ డిపార్ట్‌మెంట్‌లో 'ధన్‌ధన్‌ చినీ'
అంటూ శృంగారాన్ని పండించిన ఈ భామ ప్రస్తుతం మడికట్టుకుని కూర్చుంటానంటోంది.

ఇటీవలే ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెను ప్రస్తుతం ప్రియా అంజలి రాయ్ అనే మరో పోర్న్‌స్టార్‌ మీకు పోటీగా వస్తుందని అనుకుంటున్నారా అని అడిగితే... పైవిధంగా స్పందించింది. తనకు నటన అంటే ఇష్టమనీ, అందుకే అటువంటి పాత్రలను చేయాలనుకుంటున్నానని చెప్పింది. అయితే నథాలియాను ఒళ్ళంతా కప్పుకుంటే ప్రేక్షకులు చూస్తారా?

ప్రేక్షకులేమోగానీ... ముందు నిర్మాత, దర్శకులు ముందుకురావాలి కదా.. రెమ్యునరేషన్‌ గురించి చర్చలేదు. మంచి పాత్ర వస్తే చేస్తానని అంటోంది. గతంలో చాలామంది క్లబ్‌ డాన్స్‌లు వేసినా.. ఆ తర్వాత కాలంలో హీరోయిన్లుగా మారిన సంఘటనలు అరుదు. ప్రస్తుతం మల్లికా శరావత్‌ వంటి భామలే ఎక్స్‌పోజింగ్‌ చేస్తుంటే.. తనలాంటివారితో పనేమిటని అనుకుంది కాబోలు... మరి నథాలియా ఐడియాకు నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి.

Recent Posts