Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఐటెం భామకు అదే బాగుందట... ఒకే ఏడాది నలుగురితో...





పెద్ద హీరోయిన్లకన్నా తన పనే బాగుందని మురిసిపోతోంది హంసానందిని. ఒకే ఏడాది పవన్ కల్యాణ్, ప్రభాస్, నాగార్జున, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో నటించే అవకాశం తనకు వచ్చిందని చెబుతోంది. ఈ హీరోలతో ఈ అమ్మడు ఐటెం పాటలలో నర్తించింది. దాంతో ఎవరికీ దక్కని అవకాశం తనకి దక్కిందని సంబరపడుతోంది.

అయితే, ఐటెం పాటలు చేయడం ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదంటోంది. "ప్రతి పాటకీ వైవిధ్యం చూపించాలి. డ్రెస్సింగు మొదలు, హెయిర్ స్టయిల్, డ్యాన్స్, హావభావాలు ... ఇలా అన్నిటిలోనూ కొత్తదనం చూపాలి. అప్పుడే ఐటెం పాటల ద్వారా ఆకట్టుకోగలుగుతాం. ఇది మాకు చక్కని అనుభవం కూడా" అని చెప్పింది. పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడికి ఇదే బాగుందట!

Recent Posts