Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

టీడీపీలోకి పవన్ కళ్యాణ్...? పవర్ స్టార్ మాట్లాడడేం...?





కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన దారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ వైపు పోతున్నట్టు వార్తలు గుప్పుమనడంతో ఇపుడ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.

దీనికి తోడు యువరత్న బాలకృష్ణతో ఇటీవల పవన్ భేటీ కావడం కూడా దీనికి ఊతమిస్తున్నాయి. ఫలితంగా కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు ఫొటోలతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. వీటిని పవన్, బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్ర రాజకీయ రంగంలో చంద్రబాబుకు ఒక లెక్కుంది. సినీ రంగంలో పవన్ కల్యాణ్‌కు పవరుంది. చంద్రబాబు లెక్కకి, పవన్ కల్యాణ్ పవర్‌కు నందమూరి నటసింహం బాలయ్య తోడైతే ఎదురేముంది? అంటూ ఖమ్మంలో ఓ ఫ్లెక్సీలో రాశారు. అభిమానుల ఆకాంక్షలు ఎలా ఉన్నప్పటికీ... ఇటీవల బాలయ్య ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లి భేటీ అయ్యారని తెలియడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

తన అన్నయ్య, కేంద్ర మంత్రి చిరంజీవితో పవన్‌ కళ్యాణ్‌కు అంతరం పెరిగింది. అదేసమయంలో బాలకృష్ణకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య సంబంధాలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అడుగులు టీడీపీ వైపు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం ఆసక్తికరంగా మారింది.

Recent Posts