Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బోల్తా కొట్టిన 'రామయ్యా...' అబ్బే నాది చిన్నపాత్ర... శ్రుతి హాసన్





శ్రుతి హాసన్ ఐరన్‌ లెగ్‌ నుంచి గబ్బర్‌ సింగ్‌తో ఒక్కసారిగా లక్కీగా మారిపోయింది. ఇటీవలే ఎన్‌టిఆర్‌తో నటించిన రామయ్యా వస్తావయ్యలో ఆమె సెకండాఫ్‌లో వస్తుంది. కథకు చాలా ఉపయోగపడే పాత్ర. ఒకరకంగా సమంతకు ధీటుగానే ఉంటుంది. కానీ తను అందులో హీరోయిన్‌ అని చెప్పడంలేదు... కేవలం ప్రత్యేకపాత్ర అంటోంది..

ఇదే విషయాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ కూడా అంటున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో శ్రుతి ఆ చిత్రంలో తాను హీరోయిన్‌గా నటించానని చెప్పుకోవడంలేదు. అలా చెప్పడానికి నేను ఒప్పుకోనని స్టేట్‌మెంట్‌ ఇస్తోంది.

అయితే నటిగా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఉన్న పాత్రను చేయడంతో ఆ రకంగా తృప్తి చెందానని అంది. ఎటువంటి చిత్రాల్లోనైనా పాత్ర ఎంతసేపు అనేకంటే... నటనకు ఆస్కారం ఉందో లేదో చూస్తానంతే అని చెప్పింది.

Recent Posts