Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

షాకింగ్ : రామ్ చరణ్‌కు పిన్నిగా నయనతార...





'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెలుగులో ఓ మల్టీ స్టారర్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. వెంకటేష్, రామ్ చరణ్ హీరోలుగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ చిత్రం ఈ నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా, ఇందులో చరణ్ సరసన కాజల్ అగర్వాల్‌ను ఇప్పటికే ఖరారు చేసినట్టు సమాచారం.




ఇక వెంకటేష్‌కి జోడీగా నయనతారను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై ఆమెతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే, ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. 'సీతమ్మ' సినిమా విషయంలో జరిగినట్టే వెంకీ జోడీ విషయంలో ఇక్కడా సమస్య ఎదురవుతోంది.




ఈ సినిమాలో చరణ్‌కు వెంకీ బాబాయిగా నటిస్తున్నట్లు సమాచారం. ఆ లెక్కన వెంకీకి జోడీ అంటే, చరణ్‌కి పిన్ని అవుతుంది. మరి, నయనతార ఆ భావనను తేలిగ్గా తీసుకుని, నటిస్తుందా? లేక, సారీ చెప్పేస్తుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Recent Posts