Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆమె నా ప్రియురాలు... కానీ 18 ఏళ్ల మేనల్లుడిని వదల్లేనంటోంది.. ఎలా?



20 ఏళ్ల క్రితం నా స్నేహితురాలితో డీప్ లవ్ లో పడ్డాను. మా ప్రేమ అలా సాగుతుండగానే అనుకోకుండా పెద్దలు కుదిర్చిన అమ్మాయితో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నా భార్య నాపై పెత్తనం చెలాయిస్తూ నానా యాగీ చేసేది. ఎంత సర్దుకుపోదామనుకున్నా... నా పాత ప్రేమ విషయాలు ఎవరో చెబితే తెలుసుకున్నాననీ, నానా గొడవ చేస్తుండేది. ఎన్నిసార్లు నచ్చజెప్పాలని చూసినా వినేది కాదు. దీంతో భరించలేక విడాకులు తీసుకున్నాను.

అప్పటివరకూ నా స్నేహితురాలు ఏమయిందో తెలుసుకోలేదు. విడాకులు తీసుకున్నాక ఆమె గురించి ఆలోచనలు మొదలయ్యాయి. ఇటీవల ఆమె వివరాలు తెలుసుకుని వెళ్లాను. ఆమె నన్ను మరిచిపోలేక పెళ్లి కాదనుకుని ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలుసుకున్నాను. నా గుండె బరువుతో నిండిపోయింది. నా విషయం చెప్పి ఇక నీతోటిదో జీవితం అని ఆమె వద్ద ఉండాలని నిశ్చయించుకున్నాను. ఐతే మా ఇద్దరి మధ్య ఓ సమస్య వచ్చి పడింది. అదేమంటే, ఆమెకు 18 ఏళ్ల మేనల్లుడు ఉన్నాడు. అతడు లేనిదే ఉండలేనంటోంది. ఇంకా బతిమాలితే కనీసం వారంలో ఒక్కరోజయినా అతడి ఇంటికెళ్లి పరామర్శ చేయందే ఉండలేనంటోంది. ఆమె మనసు మార్చేదెలా...?

విడాకులు తీసుకున్నవారు తమ బాధ నుండి బయటపడేందుకు చేసే పనినే చేశారు. చాలామంది పురుషులు ఇలాగే పాత స్నేహితురాళ్లను వెతుక్కుంటారు. మీ విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే గత 20 ఏళ్లుగా ప్రేమ విఫలమై, మీరు మోసం చేసినా ఒంటరిగా జీవితం లాగించేస్తున్న ఆమె తనకు తోడుగా, ఆసరాగా మేనల్లుడ్ని చేరదీసింది.

అప్పుడు పెద్దలు చెప్పారంటూ తల వంచుకుని, విషయాన్ని వారి ముందు తెలుపలేక పెళ్లాడిన మీరు మళ్లీ ఆమెకు డిమాండ్లు పెడితే ఎలా..? అసలిప్పుడు ఆమె మిమ్మల్ని అంగీకరించడమే పెద్ద విషయం. అలాంటిది ఒంటరిగా 20 ఏళ్లు గడిపిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆంక్షలు వేయాలంటే సాధ్యం కాదు. ఆమెకు ఆమెగా మీ దారిలోకి వస్తే సరి. లేదంటే ఆమె వెళుతున్న దారిలోనే మీరు వెళ్లడం మంచిది. అంతకుమించి ఆశిస్తే ఈ స్నేహితురాలు కూడా దూరమైపోతుంది.

Recent Posts