Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

టాప్‌ హీరోలని టెన్షన్‌ పెడుతున్న ప్రభాస్‌

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్‌ ఫోర్‌ హీరోస్‌ ఎవరనేది మార్కెట్‌ లెక్కల ప్రకారం చూసుకుంటే మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఉంటారు. వీరిలో ఇంకా ఎవరికీ ఏ నంబరింగ్‌ అంటూ దక్కలేదు కానీ ప్రస్తుతం ఉన్న టాప్‌ ఫోర్‌ హీరోస్‌ మాత్రం వీళ్లే. మరి వీరి తర్వాత అయిదవ స్థానం ఎవరిది? ఈ స్థానం కోసం ప్రభాస్‌, అల్లు అర్జున్‌ మధ్య పోటీ తీవ్రంగా జరుగుతోంది. జులాయితో అల్లు అర్జున్‌ తన సత్తా చాటుకున్నాడు. .
అయితే ఆ విజయంలో సగం క్రెడిట్‌ త్రివిక్రమ్‌కి దక్కింది. అయినప్పటికీ నలభై కోట్ల క్లబ్‌లో జులాయి చేరడంతో బన్నీ స్టామినా తక్కువేమీ కాదనేది తేలింది. 

మిర్చితో ప్రభాస్‌ తన రేంజ్‌ ఏమిటో చూపించాడు. కొత్త డైరెక్టర్‌ తీసిన ఈ చిత్రానికి హోల్‌ అండ్‌ సోల్‌ క్రెడిట్‌ ప్రభాస్‌కే దక్కింది. ఈ చిత్రంతో అతను తన కెరీర్‌లో బిగ్‌ హిట్‌ సొంతం చేసుకున్నాడు. ఫాలో అప్‌గా వచ్చే సినిమా రాజమౌళిది కావడంతో ప్రభాస్‌ బాహుబలితో టాప్‌ ఫోర్‌లోకి దూసుకెళ్లేలా ఉన్నాడని అంటున్నారు. దీన్ని బట్టి అల్లు అర్జున్‌కి ముందు ముందు గట్టి సవాలే ఎదురు కానుంది. మహేష్‌. పవన్‌ ఇద్దరూ టాప్‌ 1 అండ్‌ 2కి పోటీ పడుతున్న తరుణంలో కాస్త జోరు తగ్గిన ఎన్టీఆర్‌, చరణ్‌ ఇప్పుడు తగిన శ్రద్ధ తీసుకోకపోతే టాప్‌ 4లో చోటు కోల్పోవాల్సి వస్తుంది. 

Recent Posts