Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మాస్ మహారాజా 'కిక్' తలకెక్కించుకుంటున్న రామ్ చరణ్

మాస్ మహారాజా రవితేజ, వయ్యారి భామ ఇలియానా జోడిగా గతంలో వచ్చిన 'కిక్' సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా సీక్వెల్‌‌లో ఇప్పుడు మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తుఫాన్ సినిమా పరాజయంతో చెర్రీ ఆకలిగొన్న పులిలా వున్నాడు. హిట్ కొట్టడం కోసం చెర్రీ వరుసగా
సినిమాలను ఒప్పుకుంటున్నాడు.

ఈ నేపధ్యంలో చరణ్ ఓ కథ విని ఓకే చేసినట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. గతంలో రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన కిక్ చిత్రం సీక్వెల్ చేయటానికి రామ్ చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. క్రియేటివ్ దర్శకుడిగా పేరున్న సురేంద్రరెడ్డి ఈ మధ్యనే చరణ్ దగ్గరకు వెళ్లి కథని చెప్పినట్లు సమాచారం. ఈ కథ చరణ్‌కు బాగా నచ్చిందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న 'రేసు గుర్రం' షూటింగ్ ఫినిష్ కాగానే ఈ చిత్రం ప్రారంభం కావచ్చు అని అంటున్నారు.

తన సినిమాలలో ఎంటర్ టైన్మెంట్ పాలు తక్కువగా ఉంటోంది అని తన అభిమానుల దగ్గర నుంచీ ఫీడ్ బ్యాక్ రావడంతో చరణ్ తన అభిమానులకు వినోదం పంచాలి అనే ఉద్దేశ్యంతో రవితేజకు సూపర్ హిట్ ఇచ్చిన 'కిక్' సీక్వెల్‌కు ఓకె అన్నాడని టాక్. ఇంతకీ ఈ సినిమాలో చరణ్ తన అభిమానులను ఎలా నవ్విస్తాడో చూడాలి...

Recent Posts