Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

భారత కెప్టెన్ ధోనీ ఇంటిపై రాళ్లదాడి

రాంచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటిపై బుధవారం రాత్రి రాళ్లదాడి జరిగింది. రాంచీలోని జెఎస్‌సిఎ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిందని ప్రకటించిన తర్వాత ఈ దాడి జరిగింది.
ధోనీ ఇంటిపై ఆ రాళ్ల దాడి రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ధోనీ కుటుంబ సభ్యులంతా మైదానంలో ఉన్నారు. హర్మూ హౌసింగ్ కాలనీలోని ధోనీ నివాసం ముందు భాగం పూత పూసిన గ్లాజులతో ఉంటుంది. రాళ్ల దెబ్బలకు అవి అదిరాయి. ధోనీ నివాసంపై రాళ్లు విసిరిన సంఘటన వార్త రాంచీలో ఒక్కసారిగా గుప్పుమంది. మ్యాచు ఫలితంతో ఆ సంఘటనకు సంబంధం లేదని ధోనీ కుటుంబ సభ్యులు అన్నారు. అలా దాడి జరగడం ఇది ఐదోసారి అని వారన్నారు. సిసిటివీ ఫుటేజ్‌ను చూస్తే గానీ ఎవరినీ నిందించలేమని వారు అంటున్నారు. సిసిటివీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు.

Recent Posts